సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు వాగు వంతెన ఫై వెళుతున్న ఆర్టీసి బస్సు అదుపు తప్పి
ఘోర ప్రమాదం జరిగింది. నేడు, బుధవారం ఆర్టీసీ బస్సు అదుపుతప్పి జల్లేరు వాగులో పడింది. దీంతో పలువురు ప్రయాణికులు గల్లంతయ్యారు. అయిదుగురు గల్లంతై ?ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు కిటికీల నుంచి దూకి పలువురు ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకున్నారు. ఆర్టీసీ బస్సు అశ్వారావు పేట నుంచి జంగారెడ్డిగూడెం వస్తుండగా ప్రమాదం జరిగింది. బస్సు వాగులో పడిన వెంటనే స్థానికులు, వాహనదారులు స్పందించారు. పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తాజా సమాచారం ప్రకారం,ఇద్దరు మృతులను గుర్తించినట్లు తెలుస్తుంది.
.
