సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: మార్చి 5వ తేదీన ప్రభుత్వ విప్, నరపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఏకైక కుమార్తె వివాహానికి సీఎం జగన్ మోహనరెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి గ్రామానికి రానున్న దృష్ట్యా కలెక్టర్, ఎస్పీ ఇతర అధికారులు ఇప్పటికే యలమంచలి బైపాస్ రోడ్డు కాజా వద్ద హెలిప్యాడ్ , భారీ వివాహవేదిక ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ తో పాటు పలువురు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ,రాజకీయ పార్టీలకు అతీతంగా నేతలు విశేషంగా తరలి రానుండటం తో పోలీస్ భద్రతా ఏర్పాట్లు భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు.
