సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలోని పంట కాలువలకు నేటి శనివారం నుండి గోదావరి నది నుండి విడుదల చేసే సాగునీటి సరఫరా నిలిపివేశారు. ఇప్పటికే గత 3 రోజులుగా గ్రామాల్లోమంచినీటి చెరువులను శరవేగంగా నింపుతున్నారు. జిల్లాలోని 20 మండలాల పరిధిలో సుమారు 409 గ్రామ పంచాయతీల్లోని మంచినీటి చెరువులను పూర్తిగా నింపుకోవాలని ఇప్పటికే జిల్లా పంచాయతీ అధికారులు ఆదేశాలు ఇవ్వడం వాటిని కరెంట్, ఆయిల్ మోటారులను ఉపయోగించి చెరువులలో నీటిని నింపుతున్నారు.. జూన్ 1వ తేదీన తిరిగి కాలువలకు నీటిని విడుదల చేస్తారు. అప్పటివరకు గ్రామాల్లో దాళ్వా పంటకు, ప్రజలకు మంచినీటి ఎద్దడి తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే వేసవి తాపంతో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో చెరువుల్లోని నీరు ఆవిరయ్యే అవకాశం ఉన్నందున 45 రోజులపాటు ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని పంచాయతీల్లో ప్రచారం చేస్తున్నారు. ఈలోగా ఇరిగేషన్ అధికారులు పంట కలువలులకు చేప్పట్టవలసి పనులు వేగంగా పూర్తీ చెయ్యవలసి ఉంది.
