సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఈ మే నెల 10న పాలిసెట్ పరీక్షల నిర్వహణకు పశ్చిమ గోదావరి జిల్లాలో విద్య శాఖ అధికారులు జిల్లాలో మే 10న మరియు 19 పరీక్ష కేంద్రాలలో పాలీసెట్–2023 నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భీమవరం –6, తణుకు – 8, తాడేపల్లిగూడెం–1, నరసాపురం–4 చప్పున పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వీటిలో 6,462 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఆరు ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశాం. పోలీస్, రెవెన్యూ, విద్యా శాఖల అధికారులు టీమ్‌గా ఉంటారు. . ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు ఉదయం 9 గంటలకే పరీక్ష కేంద్రం వద్ద రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నారు. పరీక్షలు నిర్వహించిన తేదీలో ఆర్టీసీ అధికారులు బస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక 15 నుంచి మే 19 వరకు ఏపీ ఈఏపీసెట్ (ఎంపీసీ), మే 22, 23 తేదీలలో ఏపీ ఈఏపీసెట్ (బైపీసీ), జూన్ 6న ఏపీ ఈఏపీసెట్, మే 24, 25 తేదీలలో ఏపీ ఐసెట్, మే 28 నుండి 30 వరకు ఏపీ పీజీసెట్, జూన్ 3వ వారంలో ఏపీ ఎడ్‌సెట్, మే 20న ఏపీ లాసెట్/పీజీ ఎల్ సెట్, జూన్ 6 నుంచి 10వ తేదీ వరకు ఏపీ పీజీసెట్, మే 31 నుంచి ఏపీ పీఈసెట్‌లకు పరీక్షలను నిర్వహించను న్నట్లు తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణకు భీమవరం – 4, నరసాపురం ఒకటి, తాడేపల్లిగూడెం –2, చప్పున పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
