సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: మరో సారి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఆస్తుల రిజిస్ట్రేషన్ చార్జీలు పెరుగనున్నాయని తాజా పరిణామాల రీత్యా భావిస్తున్నారు. జిల్లాలోని 15 సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల పరిధిలో భీమవరం, గునుపూడి , తాడేపల్లిగూడెం, తణుకు, సజ్జాపురం, పాలకొల్లు, నర్సాపురం సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు పట్టణ పరిధిలో ఉండటం వల్ల ఎక్కువ ఆదాయం సాధించడంలో కీలకమైనవి. వివరాలలోకి వెళ్ళితే.. గత ఆర్ధిక సంవత్సరం జిల్లాలో అంటే స్టాంప్ చార్జెస్ ఇతరత్రా ప్రభుత్వ సేవల చార్జీల ద్వారా రిజిస్ట్రేషన్ ఆదాయం 486.50 కోట్లు లక్ష్యం ఇచ్చారు. అయితే అనూహ్యంగా రిజిస్ర్టేషన్‌ శాఖ లక్ష్యాన్ని చేరుకోలేక రూ.383.50 కోట్లు ఆదాయం మాత్రమే లభించింది. అంటే సుమారు 80 శాతం లక్ష్యం సాధించారు. మరి మిగతా 20 శాతం బ్యాలన్స్ ఈ ఏడాది టార్గెట్ పూర్తీ చెయ్యడానికి పట్టణాలలో మినహాయించి జిల్లాలోని ప్రతి సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయ పరిధిలోనూ కనిష్టంగా ఆస్తులు, స్థలాలు కొనుగోళ్లు ఎక్కువ జరుగుతున్నా ఆరు గ్రామాలకు తగ్గకుండా రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు భావిస్తున్నారు. అధికారులు ఈనెల మే 25 నాటికి ప్రతిపాదనలు సిద్ధం అయితే.. వాటిని ప్రభుత్వం ఆమోదిస్తే జూన్‌ ఒకటి నుంచే పెరిగిన రిజిస్ట్రేషన్ చార్జీలు అమల్లోకి వస్తాయని ? భావిస్తున్నారు. కాబట్టి జిల్లాలోని కీలక గ్రామాల లో ప్రజలు ఈనెల ఆఖరులోగా పెండింగ్ లోని రిజిస్ట్రేషన్స్ పూర్తీ చేస్తే కొంత డబ్బు ఆదా చేసే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *