సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్; భీమవరం కలెక్టరేట్ లో పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రామచంద్ర రెడ్డి జిల్లా స్థాయి వ్యవసాయ సలహామండలి సమావేశంలో మాట్లాడుతూ.. రైతుల కోసం రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు రాయితీలపై రూ.13.30 కోట్ల విలువైన వ్యవసాయ పనిముట్లు వచ్చే జూన్ నెలలో సరఫరా చేస్తామని తెలిపారు. రైతుల వద్ద పండిన పంట నమోదు వివరాలు పక్కాగా ఉంటే ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు తలెత్తవు అన్నారు. మరో 6 రోజులు ఓపిక పడితే జూన్ 1న పంట కాలువలకు గోదావరి నీరు విడుదలవుతుందని..జలాలు జిల్లా శివారు ప్రాంతాలకు చేరడానికి పది రోజుల సమయం పడుతుందని తెలిపారు. కాలువల్లో తూడును తొలగించేలా చర్యలు తీసుకొంటామని, అలాగే వచ్చే జూన్ 3వ వారం లోగ నారుమళ్లు వేసుకునేలా రైతులను ప్రోత్సహిద్దామన్నారు. జిల్లా వ్య వసాయాధికారి జడ్ వెంకటేశ్వ రరావు, జడ్పీ సీఈవో రవికుమార్, సలహా మం డలి సభ్యు లు తదితరులు పాల్గొన్నారు.
