సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయానికి కీలక సూత్రధారిగా దేశవ్యాప్తంగా పేరుగాంచిన ప్రస్తుత కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్‌కు గత సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండ్రాజవరం మండలం చిలకపాడులో నూతనంగా నిర్మించిన శివాలయం లో శివలింగం ప్రతిష్టాపనకు ఆయన వచ్చా రు. అక్కడ ‘చిటికిన వెంకటేశ్వరరావు’ అనే స్థానిక నేతతో ఉన్న పరిచయం మేరకు ఆయన రావడం జరిగింది. తణుకు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే, ఆరిమిల్లి రాధాకృష్ణ ఆయనను సాదరంగా తన ఇంటికి తీసుకొనివెళ్ళి ఘన సన్మానం చెయ్యడం జరిగింది. ఇటీవల వై వైస్ షర్మిల బెంగుళూరు లో తనను కలసిన విషయం ఫై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన వై యస్ షర్మిల తన సోదరి అని, ఎప్పుడైనా తనను కలిసే అనుబంధం ఆమెకు ఉంటుందని.. అయితే ఇక్కడ రాజకీయాలకు గురించి వద్దు అని, డిప్యూటీ సీఎం శివకుమార్ వ్యాఖ్యానించడం గమనార్హం, ముందుగా కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ రాజమహేంద్ర వారంలో ఎయిర్ పోర్ట్ కు చేరుకోవడంతో స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు…పర్యటన అలాగే, ముగించుకుని తిరిగి ఎయిర్‌పోర్టు కు చేరుకున్నాక కూడా ఆయనకు వీడ్కోలు పలికారు.
