సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం సమీపంలో వాగులో ఆర్టీసీ బస్సు పడి 10 మంది మరణించిన విషాదం ఘటన తరహాలోనే.. పశ్చిమ గోదావరి జిల్లాలోనే మరో ఆర్టీసీ బస్సు ప్రమాదం అంచులవరకు వచ్చి ఆగింది. మార్టేరు సమీపం నుండి కమలాపురం నుంచి నరసాపురం వస్తున్న ఆర్టీసీ బస్సు మార్టేరు పెనుగొండ రోడ్డు మధ్యలో బస్సు క్రిందకట్టలు, పింక్ పిన్ను విరిగిపోయి టైర్లు అడ్డం తిరగడంతో ఒక్కసారిగా అదుపు తప్పింది. అయితే డ్రైవరు చాకచక్యంగా వ్యవహరించడంతో అక్కడే ఉన్న కాలువ అంచు వరకు వెళ్లి ఆగింది. ఈ బస్సులో సుమారు 20 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
