సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: మంత్రి కొట్టు సత్యనారాయణ చొరవతో గత బుధవారం రాత్రి సీఎం జగన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కాబినెట్ మీటింగ్ ఆమోదంతో .. ఇకపై భీమవరం, నరసాపురం తో పాటు కొత్తగా తాడేపల్లి గూడెం కూడా కలపి పశ్చిమ గోదావరి జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్స్ కానున్నాయి. నరసాపురం డివిజన్లో మొగల్తూరు, పాలకొల్లు, యలమంచిలి, ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర, పోడూరు, తణుకు, ఇరగవరం, నరసాపురం మండలాలు ఉన్నా యి. భీమవరంలో వీరవాసరం, ఉండి, పాలకోడేరు, కాళ్ల, ఆకివీడు, తాడేపల్లిగూడెం , పెంటపాడు, అత్తిలి ఉన్నాయి. తాజగా ఏపీ కాబినెట్ గణపవరాన్ని భీమవరం డివిజన్లోకి చేర్చడం తో ఆ మండలం పశ్చి మలో విలీనం ఖాయం అయ్యింది. అయితే తాజగా జరిగిన చేర్పులు మార్పుల నేపథ్యంలో.. భీమవరం డివిజన్లో ఉన్న తాడేపల్లిగూడెం, పెంటపాడు, అత్తిలి మండలాలతో కొత్తగా తాడేపల్లిగూడెం డివిజన్ మరియు నూతన పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే నూతన తాడేపల్లి గూడెం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో నరసాపురం పోలీస్ సబ్ డివిజన్ లో ఉన్న తణుకు నియోజకవర్గం కలవనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *