సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 29వ తేదీ నుండి 340 రైతు సేవా కేంద్రాల్లో రైతులు పండించిన ఖరీఫ్ పంట ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అధికారులు రైతుల నుండి సేకరించిన ధాన్యం కోసం అధికారులు రైస్ మిల్లర్స్ నుంచి తీసుకొచ్చిన గోనె సంచులు, తేమ శాతం కొలిచే పరికరాలు సిద్ధంగా ఉంచాలని ఆదేశిం చారు. జిల్లాలో రైతులు తాము పండించిన ధాన్యాన్ని ఎక్కడైనా అమ్ముకొనేలా ఏర్పా టు చేశామన్నారు. అయితే జిల్లా దాటి వెళితే మాత్రం సివిల్ సప్లయీప్స్ ఎండీ లాగిన్ నుంచి అనుమతి తీసుకోవలసి ఉంటుందన్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో ధా న్యం కొనుగోలు ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు.
