సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 14 నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన 2.0 సాఫ్ట్ వేర్ ద్వారా ఆధారంగా ఇకపై రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. దీనిపై ఇప్పటికే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖాధికారులు పలు చోట్ల ప్రయోగాత్మకం గా ట్రయల్ రన్ చేసి పలు అవరోధాలు ఎదుర్కొన్నప్పటికీ వాటిని అధిగమించి ఈ నెల 14 నుంచి అంటే ఎల్లుండి మంగళవారం నుండి మాత్రం జిల్లాలోని జిల్లాలోని ప్రధానమైన భీమవరం , గునుపూడి సబ్ రిజిస్టర్ కార్యాలయాలతో సహా మొత్తం15 సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో దీనిని అమలులోకి తెస్తున్నారు. కాబట్టి కొత్తగా రిజిస్ట్రేషన్స్ చేయించుకునే వారు 2.0 సాఫ్ట్ వేర్ ద్వారానే ఇకపై తమ పనులు చేయించుకోవాలి..
