సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నికలు సమీపిస్తున్న వేళా పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీస్ అధికారుల బదిలీల పర్వము కొనసాగుతుంది. తాజగా.. జిల్లాలో నలుగురు సీఐలను బదిలీ చేశామని జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ భీమవరం లోని తన కార్యాలయంలో తెలిపారు. ఏలూరురేంజ్ వీఆర్‌లో ఉన్న కె.మంగాదేవిని పాలకొల్లు టౌన్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న సీఐ రాంబాబును ఏలూరురేంజ్ వీఆర్‌కు పంపించారు. పెనుగొండ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న సీఐ దేశంశెట్టి వెంకటేశ్వరరావును వెస్ట్ గో దావరి డీసీఆర్‌బీకి బదిలీ చేసినట్లు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పనిచేసి వీఆర్‌లో ఉన్న ఎన్.రజనీకుమార్‌ను పెనుగొండ సీఐగా బదిలీ చేశారు. ఇక ఏలూరు జిల్లాలో ఏలూరు రేంజ్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐలలో సీనియారిటీని బట్టి 12 మందికి సీఐలుగా పదోన్నతులు కల్పిస్తూ ఏలూరు రేంజ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జీవీజీ అశోక్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.
