సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చిన్నారులను అంగవైకల్యం భారీ నుండి కాపాడటానికి పల్స్ పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమం వచ్చే మార్చి 3న ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తామని, దీనికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో కూడా వ్యాక్సినేషన్‌కు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు వివరించారు. జిల్లాలో 0–5 ఏళ్ల వయస్సుగలచిన్నారులకు 90శాతం పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని డీఎంహెచ్‌వో తెలిపారు. చిన్నపాటి రుగ్మతలు, జలుబు, విరేచనాలు ఉన్నప్పటికీ వ్యాక్సిన్ వేయవచ్చని స్పష్టం చేశారు. మార్చి 3న వ్యాక్సిన్ వేయించుకోని పిల్లలను గుర్తించేందుకు మరుసటి రోజు వైద్యసిబ్బంది, అంగన్వాడీ, ఆశా, వలంటీర్లు బృందాలుగా ఏర్పడి వ్యాక్సిన్ క్యారియర్లతో ఇంటింటికీ తిరుగుతూ సర్వేచేసి వ్యాక్సిన్ వేస్తారని చెప్పారు. పిల్లల కు నూరుశాతం వ్యాక్సినేషన్ జరిగేలా చర్యలు తీసుకుంటారన్నారు.
