సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మరో వారం రోజులలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తుందని భావిస్తున్నారు.. ఇప్పటికే వైసీపీ అభ్యర్థులు అటు అసెంబ్లీ కి ఇటు లోక్ సభకు కూడా వారి స్థానాలలో ప్రజల మధ్యకు క్యాడర్ తో కలసి వెళ్లిపోయారు. కాస్త ఆలస్యం అయిన టీడీపీ తేరుకొని పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాలకు గాను తణుకు, ఉండి, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాలకు తన అభ్యర్థులను ఇటీవల వారం రోజుల క్రితం ప్రకటించేసింది. వారు కూడా వారి స్థానాలలో అసమ్మతి ని ఎదుర్కొంటున్నప్పటికీ వారి స్థానాలలో ప్రచారం ప్రారంభించేశారు. అయితే జనసేనకు ముందు నుండి మిగిలిన3 సీట్లలో ఎవరు అభ్యర్థులుగా పోటీ చేస్తారో చాల కాలం నుండి అవగాహన ఉన్నపటికీ తాజా పరిణామాలలో కధ మొదటికి వచ్చేసింది. మూడు సీట్లలో ఎవరిని అభ్యర్థులుగా నిలబెడతారో?ఇంతవరకూ స్పష్టత లేదు. కాపు సామాజిక వర్గం ప్రాబల్యం అధికం గా ఉన్న ఆ మూడు స్థానాల్లో ఒక్క జనసేన అభ్యర్థిని కూడా అధికారికంగా ప్రకటించకపోవడం.. ఒకవేళ ఆయా స్థానాలలో టీడీపీ నేపథ్యంలో ఉన్న వారిని జనసేన కొత్త అభ్యర్థులను ప్రకటించిన ఎన్నికలకు సమయం తక్కువ ఉండటంతో అసంతృప్తులను దాటుకొని గెలుపు బాటలోకి ఎలా తీసుకోని వెళ్లాలో? తెలియక జనసేన శ్రేణులు ఆందోళలన లో ఉన్నాయి. వారం క్రితం వరకు ఎంతో ఉత్సహంగా ఎన్నికల బరిలో దిగుదామని మంచి ఊపు మీద ఉన్న జనసేన కు కూటమి పొత్తు అంటూ పరిగెత్తే కళ్ళకు బంధం వేసినట్లయింది. తణుకులో టికెట్ ఆశించి భంగపడ్డ జనసేన నేత విడివాడ రామచం ద్రరావు, ఆయన వర్గీయులు బాధ వర్ణనాతీతం.. మరో ప్రక్క నరసాపురం సీటు మత్స్య కార వర్గానికి చెందిన బొమ్మిడి నాయకర్ కి ఇస్తారని భావించగా.. ఆ సీటు కొత్తగా చేరిన జనసేన లో చేరిన కొత్తపల్లి సుబ్బా రాయుడు వర్గం ప్రచారం చేస్తుంది. ఎన్నో కష్టాలు భరించిన జనసేన క్యాడర్ ను ఎన్నికల ముందు చంద్రబాబు మెప్పు కోసం గాలికి వదిలేసింది పవన్ కళ్యాణ్ అని, భీమవరం సీటు టీడీపీ అభ్యర్థి అంజిబాబు కు ఇచ్చేసి తాను పిఠాపురం వెళ్లిపోవాలని చూడటం పెద్ద ద్రోహం అని ఇటీవల వైసీపీలో చేరిన చేగొండి సూర్యప్రకాష్ విమర్శిస్తున్నారు. ఇన్నాళ్లు పవన్ వెంట ఉండి ఒక్కసారిగా చాప చుట్టేసి వైసిపి కి వెళ్లిపోయిన సూర్యప్రకాష్ ఫై జనసేన కూడా ఆగ్రహంతో ఉంది. మొత్తానికి అసలు జనసేనాని ప్యూహం ఏమిటో ? అది కూటమిని అధికారంలోకి తెస్తుందా? లేదా జనసేన కు ముప్పు తెస్తుందా? చూడాలి..
