సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎటువంటి కాలుష్యం లేకుండా ప్రజలు స్వయంగా తక్కువ ఖర్చుతో సూర్య కాంతి తో విద్యుత్తూ అవసరాలు తీర్చుకోవడానికి ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజనలో పశ్చిమ గోదావరి జిల్లాలోని 3గ్రామాలను ఎంపిక చేసినట్లు అవి భీమవరం లోని కొవ్వాడగ్రామం.. నరసాపురంలో పీఎం లంక పాలకొల్లు లోని ఆగర్తిపాలెం (పాలకొల్లు), గ్రామాలను నోడల్ విలేజ్ లుగా ఎంపిక చేసినట్లు మీడియా సమావేశంలో ఈపీడీసీఎస్ ఎస్‌ఈ రఘునాధ్‌బాబు ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ ‘500 విద్యుత్ కనెక్షన్లు ఉండే ఈ మూడు గ్రామాల్లో నూరు శాతం సోలార్ రూప్‌ను ఏర్పాటు చేయాల ని ప్రతిపాదించాం. ముందు ప్రయోగాత్మకంగా ఆ మూడు గ్రామాలకు ప్రభుత్వం రూ.కోటి చొప్పున గ్రాంట్ విడుదల చేస్తుంది. కిలోవాట్స్‌కు రూ.30 వేలు, 2 కిలో వాట్స్ రూ.60 వేలు, 3 కిలో వాట్స్‌కు రూ.75 వేలు వినియోగదారుడు చెల్లించాలి. ప్లాంట్ ఏర్పాటు చేసిన తర్వాత సబ్సిడీ వినియోగ దారుల ఖాతాల్లో జమవుతుంది. జిల్లాలో ఇప్పటికే సోలార్ రూప్‌కు 8 వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటి వరకు 250 మందికి సబ్సిడీపై సోలార్ ప్లాంట్‌లందించాం. పది రోజుల్లో సర్వే చేసి మరో 245 మందికి సోలార్ రూప్ లు ఇస్తామని తెలిపారు.
