సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : ఒక్క ప్రక్క సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది. మరో ప్రక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని భారీ వర్షాలు వాయుగుండాలు తుపానులు వచ్చిన పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులను కరుణించే డెల్టా భూమిలో దైవికంగా వరి రైతులు ఈ ఖరీఫ్ సీజన్ లో స్వల్ప నష్టాలు మినహా మరోమారు మంచి ఆదాయం సంపాదిస్తున్నారు, జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 4.10 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు అందులో సగం రెండు లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. సేకరించిన ధాన్యానికి రూ.460 కోట్లు చెల్లింపులు కూడా ప్రభుత్వం రైతుల ఖాతాల్లో చేస్తుంది. కీలకమైన సమయంలో గత 4 రోజులుగా ఎండలు కాయడంతో గ్రామీణ ప్రాంతాలలో ధాన్యం కోతలు , అమ్మకాలతో రైతులు మంచి జోష్ తో పనులు ముగిస్తున్నారు. కోతలు కొనుగోలు అనంతరం ధాన్యం మిల్లులకు చేరిపోతున్నాయి. ఈ ఏడాది ఇదే ఆనందంతో రైతులు రబీ సాగుకు సిద్ధమవుతు న్నారు.
