సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా 2024 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. ఓటర్లు లిస్ట్.. మరణించిన ఓటర్లు .. నకిలీ ఓటర్ల జాబితాల వెరిఫికేషన్ తదితర అంశాలపై జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. భీమవరం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ప్రశాంతి, జేసీ ఎస్.రామ్‌సుందర్ రెడ్డి, డీఆర్వో కె.కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గత జనవరి 6వ తేదీ నుంచి ఇప్పటి వరకు పారదర్శకంగా జరిగిన ఓటర్లు లిస్ట్ పరిశీలనలో 78 వేల 568 ఓటర్లు తొలగింపులు జరిగాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నింటిని పునః పరిశీలన చేశామన్నారు. అలాగే కొత్త ఓటర్లు ను గుర్తించి నమోదు చెయ్యడం జరుగుతుందన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి అనర్హుల ఓటర్లకు సంబంధించి అందిన ఫిర్యాదుల పరిశీలన కూడా అధికారుల సహకారంతో పూర్తిచేశాం. ఫారం–6, 7, 8లకు సంబంధించి ఎలాంటి పెండింగ్ లేకుండా సకాలంలో పరిశీలిస్తాం అని తెలిపారు.
