సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా తీవ్రమైన చలి మంచు తో నిండిపోతుంది. ఉదయం 9 గంటల కూడా భీమవరం పరిసరాలలో రోడ్లపై 10 అడుగుల దూరంలో ఉన్న వాహనం కానీ వస్తువు కానీ కనపడని పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లోనూ రాత్రి పగలు కూడా చలి తీవ్రత బాగా పెరిగిపోయింది. గత శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లో 19. 2 తాడేపల్లిగూడెంలో 19.4, నరసాపురంలో 19.4, సెల్సియస్ డిగ్రీలు నమోదు కాగా విశాఖ వైపు ఏజెన్సీ ప్రాంతాలలో కేవలం 4 నుండి 6 డిగ్రీల సెల్సియస్ కు పడిపోతున్నాయి. మరోవైపు హైదరాబాద్ నగరంలో కనిష్ఠంగా 13.2, గరిష్ఠంగా 30.4 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.నిజానికి దేశవ్యాప్తంగా చలి తీవ్రత పెరిపోయింది. ఉత్తరాది రాష్ట్రాలు చలికి వణికిపోతున్నాయి. రికార్డు స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవు తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో పరిస్థితి మరింత దిగజారుతోంది.పొగమంచు కమ్మేయడంతో పలు విమాన సర్వీసులు ఆలస్యం లేదా రద్దు అవుతున్నాయి. ప్రజలు సీజనల్ వ్యాధుల నుండి , జ్వరాలు నుండి తగిన ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలి
