సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాలు మూడో రోజుకు చేరుకున్నాయి. పందాలకు ఈరోజు వరకు అనాధికార అనుమతి ఉంది. సాయంత్రం నుంచి పందాలకు అనుమతి లేదంటూ ప్రచారం జరుగుతోంది. 3 రోజులుగా సాగుతున్న కోడిపందాల్లో సుమారు రూ.400 కోట్ల వరకు చేతులు మారినట్లు సమాచారం. కోడిపందాల ముసుగులో యధేచ్ఛగా పేకాట, గుండాట జరుగుతున్నాయి. ప్రతీ కోడి పందెం శిబిరం వద్ద మద్యం బెల్ట్ షాపులు కూడా వెలిశాయి.కోట్ల రూపాలయ మధ్యం ఏరులై పడుతోంది.
