సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా గత నెల 26వ తేదీ నుంచి వైద్య ఆరోగ్య శాఖ చేపట్టిన కుష్ఠు వ్యాధి కి సంబందించిన సర్వేలో వైద్య శాఖ అధికారులు 960 అనుమాన కేసులను గుర్తించారు. ఇందులో నలుగురికి కచ్చితంగా కుష్టు వ్యాధి వున్నట్లు నిర్ధారించారు. ఈ నెల 16 వరకు సర్వే జరగనుండగా ఇప్పటి వరకు 20 శాతం పూర్తయ్యింది. జిల్లాలో ఇప్పటికే 76 పాత కేసులున్నాయి. వీరికి ఆరు నెలల పాటు వైద్య సేవలందిస్తే పూర్తిగా నయమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంటింట సర్వేకు జిల్లావ్యాప్తంగా 1,235 మంది ఆశా వర్కర్లు సర్వే చేస్తున్నారు. కరోనా సమయంలో రెండేళ్ల పాటు చాలామంది శరీరంపై చిన్న చిన్న మచ్చలు ఉన్నా చూపించకపోవటం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది జూన్‌లో ఒకసారి సర్వే చేయగా, తాజాగా మరోసారి చేపట్టారు. మచ్చలు కలిగిన వారిని డీపీఎం పరీక్షలు చేసి నిర్ధారణ చేస్తారు. అనుమానిత మచ్చలన్నీ లెప్రసీ కాదని, అయితే ఇలా చేయటం వల్ల సరైన సమయంలో వైద్యం చేసేందుకు వీలు కలుగుతుంది అని వైద్య అధికారులు అంటున్నారు..
