సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశ వ్యాప్తంగా వున్న ట్రిపుల్ ఐటీ, నిట్‌లలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్– 2023 ఆన్‌లైన్ తొలి విడత పరీక్షలు నేడు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు సీఆర్‌ఆర్, భీమవరం DNR , తాడేపల్లి గూడెం వాసవి, శశి ఇంజనీరింగ్ కళాశాలల్లో జరుగుతాయి. ఈ నెల 24, 25, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రోజుకు రెండు షిఫ్టుల్లో బీఈ, బీటెక్ విభాగాల్లో జరుగుతాయి. ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం షిఫ్టులో బీఆర్క్, బీ ప్లానింగ్ విభాగంలో పేపర్–2ఏ, 2బీ పరీక్షలు నిర్వహిస్తారు.మెయిన్స్‌లో అర్హత సాధిస్తే అడ్వాన్స్‌డ్ పరీక్షకు అనుమతిస్తారు. అడ్వాన్స్‌డ్ పరీక్ష ర్యాంకు ఆధారంగా అడ్మిషన్లు ఉంటాయని పరీక్షల నిర్వాహకులు వెల్లడించారు. రెండో విడత జేఈఈ మెయిన్ పరీక్షలు ఏప్రిల్‌లో జరగనున్నాయి.
