సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీ వేంకటేశ్వరుడు స్వయంభువుడుగా వెలసిన 2 పుణ్య క్షేత్రాలు చిన తిరుమల గా ప్రసిద్ధి పొందిన ద్వారకా తిరుమలలో, మరియు భీమవరం సమీపంలోని శ్రీ కాళ్ళకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని వైష్ణవ దేవాలయాలలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేలాది భక్తులు భారీ క్యూ లైన్ లలో నిలబడి ఉత్తర ద్వారం గుండా చిన వెంకన్న స్వామిని భక్తులు దర్శించుకుంటున్నారు. గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగుతున్నాయి. చిన తిరుమలలో నేటి తెల్లవారు జామునుండి నుండి వీఐపీలకు, సాధారణ భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఉత్తరం దిశగా తిరుగుతూ గిరి ప్రదక్షణలు కూడా చెయ్యడానికి వందలాది భక్తులు ఉత్సహం చూపడం విశేషం.. అలాగే అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి గోవింద స్వాములు ఇరుముడిని సమర్పిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *