సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా నూతన ఎస్పీగా అజితా వేజెండ్ల నియమితులయ్యారు. ప్రస్తుతం జగ్గయ్యపేట డీసీపీగా పని చేస్తున్న మహిళా ఐపీఎస్ అజితా వేజెండ్ల బదిలీపై పశ్చిమగోదావరి జిల్లాకు ఎస్పీగా వచ్చారు. జిల్లా కేంద్రం భీమవరం ఎస్పీ కార్యాలయం నుండి తన విధులను నిర్వహించనున్నారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లా విభజన తరువాత తోలి ఎస్పీగా ఇప్పటివరకు చక్కగా సమన్వయంతో విధులు నిర్వహిస్తూన్నారు యు.రవిప్రకాశ్‌ను రాష్ట్రంలో కీలకమైన ఏసీబీ ఎస్పీగా బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి ఉత్త ర్వులు జారీ చేశారు.
