సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గానికి చెందిన గత జడ్పీ చైర్మెన్ కవురు శ్రీనివాస్ కు సీఎం జగన్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో ఆయన జడ్పీ పదవికి రాజీనామా చేసారు. తదుపరి పరిణామాలలో పశ్చిమ గోదావరి జిల్లా జిల్లాపరిషత్ పీఠం పై నేడు, గురువారం మధ్యాహ్నం లాంఛనం గా నిర్వహించిన ఎన్నికలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాపరిషత్ చైర్ పర్సన్ గా గంటా పద్మశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయి ప్రమాణ స్వీకారం చేసారు. ఏలూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న కుమార్, జిల్లా మంత్రులు, వైసిపి ఎమ్మెల్యేలు, జిల్లా నాయకుల సమక్షంలో గంటా పద్మశ్రీ 22వ జెడ్పీ చైర్ పర్సన్ గా పదవి ని స్వీకరించారు. ఇదిలా ఉండగా మరోసారి ‘బీ సీ’ కి అందులో మహిళకు చైర్మన్ పీఠాన్ని కట్టబెట్టడం పై వైఎస్సార్ సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేసాయి. జిల్లాలో 1995- 2000లో జెడ్పీచైర్మన్ గా టీడీపీ అభ్యర్థి ఇమ్మణ్ణి రాజేశ్వరి పనిచేయగా.. రెండో మహిళా జడ్పీ చైర్మెన్ గా పద్మశ్రీ ప్రమాణ స్వీకారం చెయ్యడం గమనార్హం. జిల్లా రైతులకు ప్రజలకు, అధికారులకు, నాయకులకు అందుబాటులో ఉంటూ సీఎం జగన్ ఆశయాల మేరకు సుపరిపాలనకు కృషిచేస్తానని పద్మశ్రీ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *