సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి మచిలీపట్నం పరిధిలోని మంగినిపూడి ఫైరింగ్ రేంజ్ వేదికగా నిర్వహిస్తున్న వార్షిక ఫైరింగ్ శిక్షణ కార్యక్రమానికి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అద్నాన్ నయీం అస్మి, ఐపీఎస్., హాజరు అయ్యి , స్వయంగా ఫైరింగ్ సాధనలో పాల్గొని, అధికారుల లక్ష్య ఛేదన నైపుణ్యాలను పరిశీలించడమే కాకుండా, వారిలో వృత్తిపరమైన స్థైర్యాన్ని నింపారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే సమయంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు అత్యంత ఆవశ్యకమని, ప్రతి పోలీసు ఫైరింగ్ రేంజ్‌లో పాటించాల్సిన క్రమశిక్షణ, గురితప్పని ఏకాగ్రత ఫై ఆయన అనుభవాలను వారితో పంచుకొన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వి. భీమారావు , జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ డీఎస్పీ   ఎం.వి.వి సత్యనారాయణ , భీమవరం సబ్ డివిజన్ డిఎస్పీ రఘువీర్ విష్ణు , నరసాపురం సబ్ డివిజన్ డిఎస్పీ శ్రీమతి జి.శ్రీ వేద , జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కె.వి.వి.ఎన్ సత్యనారాయణ గారు, డి.సి.ఆర్.బి ఇన్స్పెక్టర్ దేశంశెట్టి వెంకటేశ్వరరావు , మహిళా ఆర్మ్డ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ (అడ్మిన్) శ్రీమతి ఇ.ఇందుమతి , ఆర్మ్డ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ కె.వెంకట్రావు , జిల్లా వ్యాప్తంగా ఉన్న సీఐలు, ఎస్సైలు మరియు ఏఆర్ బలగాలు పాల్గొన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *