సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బీజేపీ పార్టీ పట్టణ అడ్జక్షుడు గా సుదీర్ఘ కాలంగా తన సేవలను అందిస్తున్న కాగిత సురేంద్ర కు పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ వైస్ ప్రసిడెంట్ గా పదోన్నతి లభించింది. బీజేపీ అధికారంలో ఉన్న లేకపోయినా భీమవరం వేదికగా పట్టణ స్థాయి , జిల్లా స్థాయి నుండి ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో జరిగే బీజేపీ పార్టీ సమావేశాల నిర్వహణ ఏర్పాట్లకు, పార్టీ భవిషత్తు కు తన వంతు శ్రమించే అసలయిన బీజేపీ కార్యకర్తగా కాగిత సురేంద్ర కు ప్రత్యక గుర్తింపు ఉంది. మరి పట్టణ అడ్జక్షుడు నుండి జిల్లా ఉప అడ్జక్షుడు పదవి బాధ్యతలను స్వీకరించిన సురేంద్ర కు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, రాజ్య సభ సభ్యులు పాక సత్యనారాయణతో పాటు ఏబీవీపీ అడ్జక్షుడు వినోద్ బీజేపీ నేతలు,కార్యకర్తలు అభినందనలు తెలిపారు.
