సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆస్ట్రేలియాలో పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కు చెందిన యువ వైద్యురాలు మృతి చెందింది. స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు కొండలు ఎక్కడానికి ట్రెక్కింగ్‌కు వెళ్లిన యువ వైద్యురాలు ప్రమాదవశాత్తు లోయలో పడి దుర్మరణం చెందింది. వేమూరు ఉజ్వల (23) అస్ట్రేలియాలో మృతి చెందింది. అంత్యక్రియల నిమిత్తం నేడు,శనివారం భౌతిక కాయాన్ని ఉంగుటూరు మండలం ఎలుకపాడులోని అమ్మమ్మ, తాతయ్యల ఇంటికి తీసుకొస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వేమూరు ఉజ్వల ఆస్ట్రేలియా గోల్డ్‌కోస్ట్‌లోని బాండ్ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ప్రస్తుతం రాయల్ బ్రిస్బేన్ ఉమెన్స్ ఆసుపత్రిలో ఆమె పని చేస్తుంది. ఉజ్వల తల్లిదండ్రులైన వేమూరు వెంకటేశ్వరరావు, మైథిలి ఇటీవల కొద్దీ రోజులుగా ఆస్ట్రేలియాలోనే స్థిరపడ్డారు.
