సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని కలెక్టరేట్ లో కలెక్టర్ , జిల్లా ప్రధాన ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ రేపటి సోమవారం ఉదయం 7 గంటల నుండి ప్రారంభమయ్యే ఎన్నికల నిర్వహణకు అన్ని ప్రాంతాలలో పోలింగ్ కు ఏర్పాట్లు, పోలీస్ భద్రతా ఏర్పాట్లు పూర్తీ చేసినట్లు ప్రకటించారు. నేడు, ఆదివారం పోలింగ్ సామగ్రి పంపిణీ, పర్యవేక్షించి రేపటి పోలింగ్ ప్రక్రియపై ఆయన సమీక్షా నిర్వహించారు. ఆయన ఆధ్వర్యంలో ఎన్నికల విధులు నిర్వ హించే పోలింగ్ సిబ్బంది మూడో విడత ర్యాండమైజేషన్, ప్రక్రియను సాధారణ పరిశీలకులు ఎం.దీప, ఎల్.నిర్మల్రాజ్ పరిశీలన కూడా పూర్తి చేసినట్టు తెలిపారు. జిల్లాలోని ఎన్నికల పరిశీలకులు, వివిధ రాజకీయ పార్టీలప్రతినిధులతో సమావేశమై నియోజకవర్గాల వారీగా ఎన్నికల విధుల్లో పాల్గొనే పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు, మైక్రో అబ్జర్వబ్జర్ లు పాలొన్నారు. అందరు నిబ్బద్దత తో పనిచేయాలని, పోలింగ్ నిర్వహణ తీరును వెబ్ కాస్టింగ్ పర్య వేక్షణ బాధ్యతలను ఎటువంటి అడ్డంకులు లేకుండా సజావుగా నిర్వహించాలని తాను పర్యవేక్షిస్తుంటానని వారికీ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జె.ఉదయ భాస్కరరావు, డిప్యూటీ తహసీల్దార్ ఎం.సన్యాసిరావు, రాజకీయ పార్టీలర్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.
