సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వద్ద నిర్వాసితులకు 10 లక్షలు రూ ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ కు మద్దతుగా పోలవరం లోఆందోళన కార్యక్రమానికి కానీ, ఇటు అమరావతి రైతుల మహాసభ కు కానీ తనను వెళ్లకుండా పోలీసులు అడ్డుకొన్నారని, పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మీడియాతో అన్నారు. నేడు, శుక్రవారం పోలీసులు నిమ్మలను, ఈ పూట ఇంట్లో ఉండి సహకరించాలన్నారు. దానితో పోలీసులతో అయన వాగ్వాదానికి దిగటం, ఇది తెలుసుకొని, పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు అక్కడికి చేరుకోవడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ .. జగన్ పాలనలో అమరావతి రైతులు రోడ్డెక్కారని.. పోలవరం నిర్వాసితులు నిరసన దీక్షలు చేపట్టాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. ఇక ఏలూరు సమీపంలోని దుగ్గిరాలలో ఇంటి నుంచి బయటకు వస్తున్న టీడీపీ మాజీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తాను పోలవరం వెళ్ళడం లేదని.. పెళ్ళికి వెళ్తున్నానని చెప్పిన తరువాత చింతమనేనిని పోలీసులు వదిలివేశారు.
