సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: అల్పపీడన ద్రోణి ప్రభావంగా జిల్లావ్యాప్తంగా మొన్న, నిన్న, నేడు, ఆదివారం వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా కేంద్రం భీమవరం లో నిన్నటి నుండి ఆకాశం అంధకారం అయ్యి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి, నేటి, ఆదివారం కూడా పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తూనే ఉన్నాయి, ఇంటర్ పరీక్షలు వ్రాస్తున్న విద్యారులు ఇబ్బందులు పడుతున్నారు, జిల్లా కేంద్రం భీమవరంలో ఉదయం కొన్ని చోట్ల భారీ వాన కురిసింది. పాలకొల్లు,నరసాపురం, ఆచంటలో భారీ వర్షం కురిసింది. పలుమార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఆకివీడు లో అందే గంగానమ్మ, మూలలంక బోదెలు పూడుకుపోవడంతో వర్షాలకు పొంగి పొర్లడంతో పాటు వాడకపు నీరు రోడ్లపైకి రావడంతో పాటు . ప్రధాన రహదారులతో పాటు పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మొగల్తోరు లో మామిడి పిందెలు రాలిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. సముద్ర తీర ప్రాంతం ఉప్పు రైతులు నష్టపోయారు, ఉప్పు మడులన్నీ నీట మునిగాయి. ఉప్పురాశులు నీటపాలయ్యాయి.
