సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ రక్తపోటు’ దినోత్సవం సందర్భముగా నేడు, శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టాన ఆరోగ్య కేంద్రాలు లో వైద్య శాఖ ఉద్యోగులు ప్రపంచ రక్తపోటు’ దినోత్సవం సందర్భముగా ర్యాలీలు ప్రజా అవగాహనా సదస్సులు నిర్వహించారు. ‘రక్తపోటును అదుపులో ఉంచుకోండి.. ఆరోగ్యంగా జీవించండి” అన్న నినాదం తో ర్యాలీ ని నిర్వహించారు. భీమవరం పట్టణ సమీపంలోని గొల్లవాని తిప్ప గ్రామంలోనిర్వహించిన ర్యాలీ అనంతరం స్థానిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వద్ద జిల్లా ఆరోగ్య శాఖ అధికారి, డాక్టర్ డి. మహేశ్వర రావు మాట్లాడుతూ.. దైనందిన జీవితంలో యువకుల నుండి పెద్దవారి వరకు నిత్యం ఎన్నో ఒత్తిడులను ఎదురుకొంటున్నారని , తీవ్ర అలసట, తలనొప్పి,చూపు మసకబారటం, ఎవరో త్రోసినట్లు ఉండటం దీని లక్షణాలు అని, దీని ప్రభావం 40 ఏళ్ళు దాటిన వ్యక్తులకు ఎక్కువని అశ్రద్ధ చెయ్యకూడదని అనేక అవయవాలు దెబ్బ తినడంతో పాటు కిడ్నిలకు కండ్ల కు తీవ్ర ప్రమాదం ఒక్కసారిగా వాటిల్లే ప్రమాదం ఉందని అందువల్ల వైద్యులను సంప్రదించి ప్రతి రోజు క్రమం తప్పకుండ నిర్దేశించిన మందులు వాడి ఒత్తిడికి దూరంగా ఉండాలని అన్నారు. దీనివల్ల ప్రతి ఒక్కరు 18 ఏళ్ళ వయస్సు వచ్చినప్పటి నుండి బీపీ చెక్ చేయించుకొంటూ అప్రమత్తత తో ఉండాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ధనలక్ష్మి ఇతర వైద్యశాఖ ఉద్యొగులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *