సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ వేసవిలో.. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి.నేటి శుక్రవారం తెల్లవాఱు జామునుండి భీమవరం పరిసర ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. నేటి ఉదయం కూడా చల్లగాలులు తీవ్రంగా వీచాయి. ఈ మండు వేసవిలో ప్రజలు సేద తీరారు. ఏపీలో పలు జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే కురిసే అవకాశం ఉందని తెలిపింది.
