సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అడ్జక్షతన నేడు, మంగళవారం పార్టీకి సంబంధించిన జిల్లా కమిటీల ఎంపిక కోసం నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యులతో సమావేశం ముగిసింది. నూతన జిల్లా పార్టీ అధ్యక్ష పదవుల విషయంలో తలెత్తిన కొన్ని అభ్యంతరాలను పున:పరిశీలించాలని చంద్రబాబు సూచించార , అయితే రాష్ట్రంలోని పలు జిల్లాలకు టీడీపీ పార్టీ అధ్యక్షులను దాదాపుగా ఖరారు చేసిన టీడీపీ జిల్లా అధ్యక్షులు జాబితా..ప్రకారం.. గోదావరి జిల్లాలలో.. పశ్చిమ గోదావరి జిల్లా అడ్జక్షునిగా మరోసారి ఉండి మాజీ ఎమ్మెల్యే, మంతెన రామరాజు ను ఎంపిక చెయ్యడం పట్ల ఉండి , భీమవరం లో ఆయన అనూయులు తో పాటు జిల్లా టీడీపీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏలూరు జిల్లాకు బడేటి చంటి ని కాకినాడ జిల్లా, జోత్యుల నవీన్, తూర్పుగోదావరి జిల్లాకు వెంకటరమణచౌదరి, అంబెడ్కర్ కోనసీమ జిల్లా కు గుత్తుల సాయి లను జిల్లా అడ్జక్షులుగా ఎంపిక చెయ్యడం గమనార్హం.
