సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి ఆదివారం నుండి దక్షిణ మధ్య రైల్వేలో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నడుపుతున్న రైళ్లల్లో 6 రైళ్లను రద్దు చేశారు. మరో నాలుగు రైళ్లను పాక్షికంగా కొంతదూరం వరకు నడుపుతున్నారు. ట్రాక్‌ పనులు చేపడుతున్నందున తాత్కాలికంగా నిలిపివేశా మని రైల్వే అధికారులు ప్రకటించారు. అయితే ఈ రైళ్లలో నరసాపురం నుంచి రాత్రి 11 గంటలకు భీమవరం వెళ్లే విశాఖ లింకు ఎక్స్‌ప్రెస్‌ యథావిధిగా నడుస్తుందన్నారు. నరసాపురం నుంచి గుంటూరు వెళ్లే ఫాస్ట్‌ ప్యాసింజర్‌ ఎక్స్‌ప్రెస్‌ సోమవారం నుంచి 10వ తేదీ వరకు రామవరప్పాడు వరకే ప్రయాణిస్తుంది. తిరుగు ప్రయాణంలో కూడా రామవరప్పాడు నుంచే నరసాపురం వరకు ప్రయాణిస్తుంది. మచిలీపట్నం నుంచి భీమవరం మీదుగా విశాఖపట్నం వెళ్లే రైలును ఈ నెల 4 నుంచి9వ తేదీ వరకు రద్దు చేశారు. విశాఖపట్నం నుంచి మచిలీపట్నం వెళ్లే రైలును 5 నుంచి 10వ తేదీ వరకు రద్దు చేశారు. రైలు నంబరు 12805 విశాఖపట్టణం నుంచి లింగంపల్లికి వెళ్లే రైలును ఈనెల 3వ తేదీ నేటి ఆదివారం నుంచి 9వ తేదీ వరకు రద్దు చేశారు. రైలు నంబరు 12806 లింగంపల్లి నుంచి విశాఖపట్టణం వెళ్లే రైలు ఈనెల 4 నుంచి 10వ తేదీ వరకూ రద్దు చేశారు. రైలు 17244 రాయగడ నుంచి గుంటూరు వెళ్లే రైలును ఈనెల 4నుంచి 10 వరకు రద్దు చేసారు. రైలు 12718 విజయవాడ నుంచి విశాఖపట్టణం వెళ్లే రైలు అనకాపల్లి వరకు మాత్రమే వెళ్తుంది. రైలు 22708 తిరుపతి నుంచి విశాఖపట్టణం వెళ్లాల్సిన రైలు ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు సామర్లకోట వరకూ మాత్రమే వెళ్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *