సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం భిమాలపురం గ్రామం లోని గోదావరి నదిలో పడవ బోల్తా పడి 6గురు ప్రయాణికులతో ఇద్దరుగల్లంతయ్యారు. అయితే నలుగురు మాత్రం ఈదుకొంటూ సురక్షితంగా బయటపడ్డారు. అక్కడ సమీపంలోని లంక గ్రామంలోని కొబ్బరి తోటనుండి కొబ్బరికాయలు తరలిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
