సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో 3వ విడుత ప్రభుత్వ ఆధ్వర్యంలో .. కంటి వెలుగు స్క్రీ నింగ్ పరీక్షలు త్వ రితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. భీమవరం కలెక్టరేట్ లో కలెక్టర్. పి ప్రశాంతి మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 60 ఏళ్లు పైబడిన 88,638 మందికి మూడో విడత కంటి వెలుగు కార్య క్రమం కింద స్క్రీనింగ్ పరీక్షలు చేపట్టాల్సిఉండగా, ఇప్పటివరకూ 22,248 మందికి పరీక్షలు పూర్తీ అయ్యాయి అన్నారు. మిగతా అందరికి ఆగస్టు నెల లోగ పరీక్షలు అందరికి పూర్తీ కావాలని, కంటి వెలుగు కార్యక్రమాన్ని నరసాపురం, పాలకొల్లు మండలాల్లో లయన్స్ క్లబ్ఆధ్వర్యంలో కంటి శస్త్రచికిత్సలు నిర్వహించాలని ఆదేశించారు.
