సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీలో జిల్లా పదవులులలో మార్పులు చేర్పులు చేస్తూ పార్టీ అధినేత జగన్ తాడేపల్లి లోని తన కార్యాలయంలో పలు జిల్లాల నేతలతో చర్చలు జరుపుతున్నారు. తదుపరి ఆయన ఆదేశాలతో.. తాజగా పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. దీనిలో పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా నరసాపురం మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు నియమితులయ్యారు. నిజానికి ఈ బాధ్యతలు వైసీపీ లో ‘మాస్ పాలోయింగ్ లీడర్’ భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు అప్పగిస్తారని పలువురు వైసీపీ నేతలు క్యాడర్ భావించారు. ఇప్పటికి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల జిల్లా రాజకీయం అంతటా భీమవరం వేదిక గానే జరుగుతుంది. అయితే కారణాలు ఏవైనా ప్రసాద రాజు కు బాధ్యతలు అప్పగించారు. అధినేత జగన్ తో జరిగిన సమావేశానికి పశ్చిమ గోదావరి జిల్లా కు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం గమనార్హం. గతంలో ఆచంట మాజీ ఎమ్మెల్యే రంగనాధ రాజు పార్టీ అడ్జక్ష బాధ్యతలు నిర్వహించిన విషయం విదితమే.. ఇక నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా కాకాణి గోవర్ధన రెడ్డి, పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ని నియమించినట్లు ప్రకటించారు.
