సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా,నరసాపురం, భీమవరం సముద్ర తీరంలో మత్యకారులకు ఈ నెల 14 అర్ధరాత్రి నుంచి సముద్ర వేటపై నిషేధాజ్ఞలు ఎత్తి వేయ నున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సముద్ర జీవుల పునరుత్పత్తి సమయం కావడం తో వేట ఫై నిషేధం విధించారు. మరో 6 రోజులలో నిషేధం తొలగిపోనుండటం తో ఇప్పటి వరకు విరామంలో ఉన్న మత్యకారులు వేటకు వెళ్లేందుకు బోట్లకు మరమ్మతు పనులతో పాటు కొత్త హంగులు ఏర్పాటు చేసుకొంటున్నారు. వలలను సిద్ధం చేస్తున్నారు. ఏటా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, మచిలీపట్నం నుంచి బోట్లన్ని నరసాపురం తీరానికి చేరుకుంటున్నాయి. ముందస్తు వర్షాలతో ఈ ఏడాది వేట అనుకూలంగా సాగుతుందన్న ఆశతో మత్స్యకారులు ఉన్నారు.
