సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎట్టకేలకు టీడీపీ విజయం సాధించింది, కీలకమైన మొదటి ప్రాధాన్యత ఓట్లలో వైసీపీ అభ్యర్థి మెజారిటీ సాధించినప్పటికీ పూర్తీ శాతం మెజారిటీ కాకపోవడంతో 2వ ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ లో కూడా టీడీపీ అభ్యర్థి హోరాహోరీగా ఓట్లు పోలు అవడం వెనుక ఉద్యోగుల కుట్ర ఉందని పలుమార్లు ప్రతి రౌండ్లో వైసీపీ మెజారిటీని బాలన్స్ చేస్తూ వైసిపి ఇతరుల ఓట్లను టీడీపీ ఓట్లుగా కౌంటింగ్ చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే,కేతిరెడ్డి తదితర నేతల పిర్యాదు చేసినప్పటికీ కౌంటింగ్ కొనసాగిస్తూ.. రీకౌంటింగ్ లేకుండా రాత్రి కౌంటింగ్ పూర్తీ చేసి టీడీపీ అభ్యర్థి 7వేలు మెజారిటీ తో ఉన్నట్లు ప్రకటన వచ్చింది. జరిగిన పరిణామాలు అధికార వైసిపి కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొనివెళ్లడంతో.. టీడీపీ నేత రామగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచినట్లు అధికారులు ఇవ్వవలసిన ధ్రువీకరణ పత్రం నిలిపివేశారు, దానితో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి రాంగోపాల్ రెడ్డి ,టీడీపీ నేతలు ఆందోళనకు దిగటంతో పోలీసులుగత శనివారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. నేటి ఆదివారం ఉదయం అధికారులు గెల్చిన ధ్రువీకరణ పత్రం అందించారు,రాంగోపాల్ అరెస్ట్‎పై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ‘‘ఏం బతుకయ్యా జగన్ రెడ్డీ..ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థికి డిక్లరేషన్ ఇవ్వకుండా ఒత్తిడి చేసి అడ్డుపడతావా?.. పులివెందుల టీడీపీ నేత రామగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచాడని అక్కసుతో అర్థరాత్రి అరెస్టు చేస్తావా?..ఇంతకంటే నువ్వు ఇంకేం బ్రష్టు పట్టించాల్సివుంది. డిక్లరేషన్ అడిగిన రామగోపాల్ రెడ్డిని రాత్రి కౌంటింగ్ సెంటర్ వద్ద అరెస్ట్ చేసిన వీడియో‎ను జత చేసి చంద్రబాబు’’ ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *