సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మరో 9 రోజులలలో పశ్చిమ గోదావరి జిల్లా కు చెందిన 7నియోజకవర్గాలకు ఒక నరసాపురం ఎంపీ స్థానానికి భీమవరం పట్టణంలో ఎస్ ఆర్ కే ఆర్ , మరియు విష్ణు ఇంజనీరింగ్ కాలేజీలలో జరిగే ఓట్ల లెక్కింపులో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురుకాకుండా ఎన్నికలలో పోటీ చేసిన అభ్య ర్థులంతా జాగ్రత్త పడుతున్నారు. కౌంటింగ్ లో పాల్గొనే అభ్యర్థుల తరపు ఏజెంట్స్ వివరాలు ఈనెల 31 వ తేదీలోగా జిల్లా కలెక్టర్ కు సమర్పించవలసి ఉంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే ఎక్కడికక్కడ సమర్థులయిన కౌంటింగ్ ఏజెంట్లను అప్రమత్తం చేశారు. వారికి తగిన శిక్షణ ఇచ్చేలా జాగ్రత్త పడుతున్నారు. కౌంటింగ్‌లో అత్యంత కీలకమైన 17C పత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిం చడం, ఈవీఎం మిషన్లకు వేసిన సీల్ పరిశీలనపై ఇప్పటికే ఏజెంట్లకు శిక్షణ ఇచ్చారు. తమ అభ్యర్థులకు పడిన ఓట్లు ను కాపాడుతుకోవడం ఏజెంట్ లకు ప్రత్యేకమైన కళ . ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ లో ఒకవేళ అర్హత ఉన్నా ఏదోసాకుతో కొన్ని పోస్టల్ బ్యాలెట్‌ను పక్కన పెడతారనే అనుమానం కొంతమంది అభ్యర్థుల్లో ఉంది. ప్రత్యేకించి ఎలక్ర్టానిక్ మిషన్లలో మొత్తం పోలైన ఓట్లను లెక్కించిన ఓట్లు సంఖ్యతో సరిచూసుకోవాలని, కౌంటింగ్ తుది దశకు వచ్చినా ఎవరు నిర్దేశించిన ప్రాంతాల నుంచి కదిలి వెళ్ళకూడదని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఇదిలా ఉండగా ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓట్ల లెక్కింపు అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లోనూ సమాంతరంగా సాగనుంది. ప్రతి రౌండ్లోనూ ఎంపీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎన్ని ఓట్లు వచ్చాయో లెక్క కట్టి అనౌన్స్ చేస్తారు. ఈ సమయంలోను ఏజెంట్లు ఎక్కడికక్కడ అంకెలను సరిపోల్చుకోవాలని కూడా ఆయా పార్టీలు మార్గనిర్దేశం చేశాయి. ఉండిలో త్రిముఖ పోటీ జరుగుతుంది కాబట్టి అక్కడి అభ్యర్థులకు అత్యంత నమ్మకస్తులయిన మెరికల లాంటి ఏజెంట్ల అవసరం ఎంతో కీలకం.. ఈసారి హోరాహోరీ పోరులో భారీ మెజారిటీ లతో ఘన విజయాలు సాధించే అభ్యర్థులు ఉండక పోవచ్చు.. ఎంపీ స్థానానికి మాత్రం క్రాస్ ఓటింగ్ అవకాశం ఉంటుంది కాబ్బటి పెద్ద మెజారిటీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
