సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో శీతాకాలం చలి పంజా విసురుతుంది. ది. పగటి పూట ఉష్ణోగ్రత లు 25నుంచి 32 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య నమోదవుతు న్నాయి. ఇక రాత్రి వేళల్లో కనిష్ట స్థాయికి దారుణంగా పడిపోయాయి. రెండు రోజులుగా రాత్రి ఉష్ణోగ్రత 15 – 10 డిగ్రీలు లోపే నమోదు అవుతుందంటే దాని తీవ్రత అర్ధం చేసుకోవచ్చు. జిల్లాలో ఏలూరు, భీమవరం, ఆకివీడు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం, కొవ్వూరు, తణుకు, నిడదవోలు, జంగారెడ్డిగూడెం, తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. డెంగ్యూ జ్వరాలకు తోడు వృద్దులు, చిన్నారులు, అస్మా రోగులు జలుబు, జ్వరం, కఫం, గొంతు నొప్పి వంటి వైరల్, సీజనల్ వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలే కరోనా రోజులు హాస్పటల్ వెళ్లి ఏ మాట వినాలో అని చాలామంది ప్రజలు ఇంటి వద్, ఆర్ ఎం పి డాక్టర్స్ వైద్యం తో పాటు, వంటిటి చిట్కాల వైద్యం తో సొంతన పొందుతున్నారు.ఇక భీమవరంలో గత 7 రోజులుగా చలిగాలులు తో పాటు బోనస్ గా చిరు జల్లులు, వర్షాలు పొగమంచు అన్ని సమయాలలో అందుబాటులో ఉంటున్నాయి. ఇండ్లలో ఏసీలు కాదుకదా! ప్యాన్స్ వేసుకోవడం కూడా మానేస్తున్నారు. రాత్రి 9 గంటలకు మార్కెట్ నిశబ్దం ఆవరిస్తుంది. పట్టణ శివార్లలో ద్విచక్ర వాహనదారులు సాయంత్రము చీకటి పడగానే బళ్ళు నడపడం తగ్గించేశారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.. పిల్లల హాస్పటల్ అన్ని హోస్ ఫుల్ గా కనపడుతున్నాయి.
