సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో రైతాంగం దాళ్వా సీజన్లో వరి సాగుకు మరో 3వారాల పాటు సాగునీటి అవసరం ఉంది. ఇరిగేషన్ శాఖ అధికారులు ఈనెల 9 వరకు మాత్రమే వంతుల వారీగా నీరు సరఫరా చేస్తామని గతంలోనే ప్రకటించినప్పటికీ ఇంకా భీమవరం , ఆకివీడు, ఉండి ,కాళ్ల, నరసాపురం, మొగల్తూరు, తదితర మండలాల్లో కాలువ శివారు భూముల్లో నాట్లు ఆలస్యం కావడంతో ఆయా ప్రాంతా ల్లోప్రస్తుతం పంట పాలుపోసుకునే, ఈనిక దశల్లో ఉంది. పొలాలలో పలుచోట్ల పైరు పాలుపోసుకునే దశలో ఉండటంతో మరో ప్రక్క వేసవి నేపథ్యంలో పై నుండి నీరులేక గోదావరి నీటి మట్టం తగ్గిపోవడంతో సీలేరు జలాల విడుదలకు నీటిపారుదల శాఖ అధికారులు సిద్ధం అవుతున్నారు. ఈ నెలాఖరు వరకు పంటల కోసం వంతుల వారీగా నీరు విడుదల చేస్తున్నారు. గత 3 రోజులుగా సీలేరు నుంచి గోదావరి నదిలోకి సుమారు 8 వేల క్యూసెక్కుల నీటి విడుదలవుతుండగా జిల్లాకు నీటి సరఫరాను 3,200 క్యూసెక్కు లకు పెంచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *