సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గత శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య భర్తలు మృతి చెందటం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. మృతులు.. దెందులూరు మండలం కొమిరేపల్లికి చెందిన కాలి ప్రభాకరరావు(65), రత్న కుమారి(55) దంపతులు. రత్న కుమారి కొంతకాలం నుంచి అనారోగ్యం తో బాధపడుతున్నారు. వైద్యం చేయించేందుకు ప్రభాకరరావు శనివారం ఆమెను స్కూటర్ పై గుండుగొలను తీసుకెళ్లారు. వైద్యం తర్వాత రాత్రి తిరిగి వస్తూ కొమిరేపల్లికి వెళ్లేందుకు జాతీయ రహదారి జంక్షన్ వద్ద మలుపు తిరుగుతుండగా అటుగా వస్తున్న వ్యాను వీరి స్కూటర్ ను ఢీకొంది. రత్న కుమారి ఘటనా స్థలం లోనే మృతిచెందగా ప్రభాకరరావు తీవ్ర గాయాల పాలయ్యారు. అతన్ని హైవే అంబులెన్సు సిబ్బంది ఏలూరు సర్వజన ఆసుపత్రికి తీసుకు వచ్చారు. ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స పొందుతూ మృతిచెందారు. దెందులూరు పోలీసులు కేసు దర్యా ప్తు చేస్తున్నారు.
