సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెదేపల్లి గూడెం సమీపంలో పెదతాడేపల్లి గ్రామం, తిరుమల సాయినగర్ వద్ద జాతీయ రహదారిపై బైక్ ను ప్రైవేట్ కాలేజీ బస్సు ఢీకొన్న ఘటనలో భార్యా భర్తలు మృతి చెందగా, ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. నందమూరు గ్రామానికి చెందిన గన్నవరపు ధనరాజు, మరియమ్మ తమ పిల్లలతో కలిసి బైకు ఫై చేబ్రోలులో ఓ ఫంక్షన్ కు వెళుతూ ప్రమాదానికి గురిఅయ్యారు. ఈ ప్రమాదంలో భార్య మరియమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన ధనరాజును తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రికి, అక్కడ నుంచి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుని బంధువు అక్కా బత్తుల రాజు ఇచ్చి న ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై బి.రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, బస్సు డ్రైవర్ ను అదుపులో తీసుకోని దర్యాప్తు చేస్తున్నారు.
