సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వాయుగుండం ప్రభావం తో కురుస్తున్న వర్షాలు నిన్నటి నుండి కాస్త మోతాదు తగ్గించి నప్పటికీ భీమవరం పరిసర ప్రాంతాలలో చిరు జల్లులు కొనసాగుతున్నాయి. ఫై నుండి వస్తున్నా వరదనీరు ప్రభావంతో తాడేపల్లి గూడెంలో ఎర్రకాలువ, భీమవరం మీదుగా ప్రవహిస్తున్న యనమదుర్రు కాలువ ( ఫై తాజా ఫోటో లో చూడవచ్చు)ప్రజలను భయకంపితులను చేస్తున్నాయి. అధికారులు శ్రామికుల సహకారంతో ఇసుకబస్తాలు సిద్ధం చేసుకొని భీమవరం పట్టణంలో ఎక్కడ గండ్లు పడకుండా గస్తీ కాస్తూ, ఇప్పటికే మునిగిన లోతట్టు ప్రాంతాలలో మోటరులతో నీటిని తోడుతున్నారు. పాలకోడేరు మండలం లో మోగల్లు మీదుగా ప్రవహిస్తున్న గోస్తనీ కాలువ కు గండి పడటంతో వందలాది ఎకరాలు పంట నీట మునిగింది. అయితే ఆ గండి పూడ్చడానికి అధికారులు తీవ్రంగా శ్రమించారు. నేటి సోమవారం పశ్చిమగోదావరి జిల్లా జాయింటు కలెక్టరు ప్రవీణ్ ఆదిత్య వరద ప్రాంతాలలో సుడిగాలి పర్యటనలు చేశారు. యలమంచిలి మండలం కనకాయలంకలో నీట మునిగిన కాజ్ వే వరద ఉధృతిని పరిశీలించి, ప్రజలతో మాట్లాడి, అధికారులకు దిశానిర్దేశం చేసి, పెదలంక,దొడ్డిపట్ల, అబ్బిరాజుపాలెం, గంగడి పాలెం లక్ష్మీపాలెం, తదితర గ్రామాలలో పర్యటించారు. అధికారులు, సిబ్బంది గ్రామాల్లోనే మాకాం వేశారని ఎటువంటి ఇబ్బందులు తలెత్తిన సహాయ చర్యలు తీసుకునుటకు సంసిద్ధులుగా ఉన్నారని ప్రజలకు తెలిపారు. పునరావాస కేంద్రాలు అన్ని సౌకర్యాలతో సిద్ధం చేస్తామన్నారు. చిన్న పిల్లలకు, వృద్ధులకు ఐసిడియస్ శాఖ ద్వారా పాలను అందిస్తున్నామని అన్నారు. జిల్లా జాయింటు కలెక్టరు వెంట ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, తహాశీల్దారు సి.హెచ్.విజయశ్రీ, యంపిడివో పి.శ్రీనివాస రావు, అధికారులు, వివిధ పార్టీల నాయకులు, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *