సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలోని వైసిపి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయకర్తలతో, కీలక నేతలతో సీఎం జగన్ తాడేపల్లిలో తన కార్యాలయంలో నేడు, సోమవారం భేటీ కానున్నారు.. ఇప్పటికే పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లతో సీఎం సమావేశమై ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై సమీక్ష చెయ్యడం జరిగింది. గడప గడపకు మన ప్రభుత్వం లో ఇంటిటికి వెళుతున్న ఎమ్మెల్యే లకు ప్రజల నుండి వస్తున్నా స్వాందన , ప్రభుత్వ ప్రజాసంక్షేమ పధకాలు ఫై విశ్లేషణ , ఇతర సమస్యలపై ఆయన సమీక్షించనున్నారు. ఎన్నికలు మరో ఏడాది లో రానున్న దృష్ట్యా టీడీపీ, జనసేన పొత్తు తో ఎన్నికల బరిలో దిగితే జిల్లాలో ప్రజల దృష్టికి తీసుకొనివెళ్ళవలసిన ముందస్తు ప్యూహాత్మక కార్యాచరణ దిశ నిర్ధేశ్యంతో పాటు వైసిపి క్యాడర్ ను మరింత బలోపేతం చేసే కార్యక్రమంఫై చర్చ జరిగే అవకాశం ఉంది. జిల్లాలో పార్టీ పెద్దలతో సీఎం జగన్ నేటి సమావేశం చాల కీలకమైనదిగా వైసిపి జిల్లా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. వచ్చే మర్చి 13వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో జిల్లా నుండి ప్రజాప్రతినిధుల కోటా నుండి ఇద్దరు ప్రముఖులకు ఎమ్మెల్సీ పదవులు ఖాయం అని భావిస్తున్నారు. . అలాగే ఇప్పటికే పాలకొల్లు కు చెందిన మేకా శేషుబాబు అభ్యర్థిగా నిర్ణయం ఫైనల్ అయినట్లు ప్రచారం కాగా మరో పారిశ్రామిక వేత్త ను ఎమ్మెల్సీ కి ఎంపిక చేస్తారని భావిస్తున్నారు.
