సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 2 నెలల క్రితం కశ్మీర్‌ శ్రీనగర్‌లోని హిర్వాన్‌ – లిద్వాస్‌ ప్రాంతంలో కాల్పులు కలకలం రేపాయి. 26 మంది అమాయక టూరిస్ట్ లను హత మార్చిన ఉగ్రవాదులను భారత్ సైన్యం మట్టుబెట్టినట్లు తాజగా వార్తలు వచ్చాయి. అయితే భారత సైన్యం అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.. వివరాల లోకి వెళ్ళితే.. గత కొన్ని రోజులుగా భద్రతా బలగాలు కాశ్మిర్ లో ఆపరేషన్‌ మహదేవ్‌ చేస్తున్నాయి. నేడు, సోమవారం ఉదయం శ్రీనగర్‌లోని దాచిగమ్‌ నేషనల్‌ పార్క్‌ సమీపంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన టెర్రరిస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు చుట్టుముట్టాయి. వీరు జవాన్ల కాల్పుల్లో చనిపోయినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *