సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(POK) గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజా ఆందోళనలు ఉద్రికత్తలు తో దద్దరిల్లుతుంది. పోలిసుల కాల్పులలో పలువురు మరణించడం వందలాది మంది గాయపడటం జరిగింది. గత రాత్రి నుండి అక్కడ ఇంటర్ నెట్ సౌకర్యాలు నిలిపివేశారు.. పరిస్థితిని అదుపు చెయ్యడానికి పాకిస్తాన్ సైన్యం అదనపు బలగాలు అక్కడకు తరలిస్తోంది. వివరాలలోకి వెళ్ళితే స్థానిక అవామీ యాక్షన్ కమిటీ (AAC)నాయకత్వం లో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతికంగా వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి భారీ ఆందోళనలు చేపట్టారు. అవామీ యాక్షన్ కమిటీ.. గత 70 సంవత్సరాలుగా మా ప్రజలకు ప్రాథమిక హక్కులను అమలు చెయ్యకుండా పాకిస్తాన్ తమను అణగద్రొక్కుతుందని, స్థానిక ప్రజలను దోచుకొంటుందని ఆరోపిస్తూ.. 38 పాయింట్ల నిర్మాణాత్మక సంస్కరణలను డిమాం డ్లను పాక్ ప్రభుత్వానికి ఇచ్చింది. తమ ప్రాంతాలను ఆక్రమించడం మానుకోవాలని , వనరులను దోచుకోవడం మానుకోవాలని పాకిస్తాన్ ను POK ప్రజలు హెచ్చరిస్తున్నారు. తమను భారత్ లో కలిపేయాలని డిమాండ్ కూడా అక్కడ ప్రజలలో పెరుగుతుంది. తాజా పరిణామాలను భారత్ పరిశీలిస్తుంది.
