సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలనే భారత సైన్యం ధ్వంసం చేసింది! పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగానే దాడులు చేశామని స్పష్టం చేసింది! అయినా.. చైనా నాసిరకం యుద్ధ సామాగ్రి ని నమ్ముకుని పాకిస్థాన్‌ భారత్ ఫై కయ్యానికి కాలు దృవ్వి భారత్ సైనిక స్థావరాలు, సరిహద్దులోనో 15నగరాలలోని అమాయక ప్రజల ఆవాసాలపై గురి పెట్టింది! క్షిపణులు, డ్రోన్లతో దాడికి విఫల యత్నం చేసింది! ఆ దాడులను మన ‘సుదర్శన చక్రం’ (ఎస్‌-400 ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌) తుత్తునియలు చేసింది! ప్రతిగా..గత రాత్రే లెక్క సరిచేయడానికి భారత్ త్రివిధ సైన్యం మూడో కన్ను తెరచింది. భూమి మీద నుండి, సముద్రం మీద నుండి, గాలిలో వాయు మార్గం నుండిఒకేసారి పాకిస్తాన్ ఫై విరుచుపడి లోని అన్ని ప్రధాన నగరాలపై డ్రోన్లు, రాకెట్ల వర్షం తో పాకిస్తాన్ ను అగ్ని స్నానం చేయించింది.దేశంలోని అన్ని ప్రధాన ఆర్మీ స్థావరాలు వాటిలో దాచిన రక్షణ సామాగ్రి పేలుళ్లతో పాకిస్తాన్ ఫై భారత్ రుద్ర తాండవం చేసింది. కరాచీ పోర్టుపై భారత నావికా దళం భీకర దాడి చేసింది! అరేబియా సముద్రంలో ఉన్న ఐఎన్‌ఎ్‌స విక్రాంత్‌ గ్రూపు నుంచి బ్రహ్మోస్‌ క్షిపణుల వర్షం కురిపించింది! ఆ దెబ్బకు అగ్నికి ఆహుతి అయిన కరాచీ రేవు ను బాగుచెయ్యాలంటే మరో 2 ఏళ్ళు పడుతుంది. అక్కడి 10 భారీ నౌకలు ధ్వంసమయ్యాయి. 1971 తర్వాత కరాచీ పోర్టుపై భారత్‌ దాడి చేయడం ఇదే తొలిసారి. పాకిస్తాన్ ప్రధాని ఇంటి ముందు బాంబులు పేలాడటం తో ప్రధాని షరీఫ్ రహస్య ప్రాంతానికి పారిపోయారని సమాచారం. మరో ప్రక్క పాకిస్తాన్ లోని పెట్రోలు, గ్యాస్ వనరులు ఉన్న కేట్ వా నగరంతో పాటు మరో 7 ప్రధాన పట్టణాలను బెలూచిస్తాన్ ఆర్మీ ఆక్రమించేసి పాక్ జెండా పీకేసి తమ జెండా ఎగురువేసుకొని భారత్ కు కృతఙ్ఞతలు తెలుపుకొంది. మరో పక్క ఆప్ఘనిస్తాన్ సరిహద్దులోని పాకిస్తాన్ కైబర్ కనుమలు కూడా స్వతంత్రత ప్రకటించుకునే ఊపులో పాక్ సైన్యం ను మట్టుబెడుతున్నాయ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *