సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉగ్రవాద పాములకు పాలు పోసిన పాపానికి .. ఇటీవల కాలంలో భారత్ ‘ఆపరేషన్ సిందూర’ తరువాత కన్ను లొట్టపోయి చావు తప్పించుకున్న పాకిస్థాన్‌ పరిస్థితి ఇప్పటికి ఏమి బాగోలేదు. ఒక పక్క బెలూచిస్తాన్ తెగలు , మరోప్రక్క కైబర్ కనుమలలో 3 జిల్లాలలో స్థానిక తెగలు స్వతంత్రత ప్రకటించుకొంటే.. మరో ప్రక్క పాక్ ఆక్రమిత కాశ్మిర్ లో ఉద్యమ సెగలు ఉవ్వెత్తున లెగుస్తున్నాయి. మరో ప్రక్క దేశంలో అను నిత్యం బాంబు పేలుళ్లు తో ప్రజల మరణాలతో పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఇదిలా ఉండగా పెషావర్‌లో గల పారామిలిటరీ దళ ప్రధాన కార్యాలయంపై బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. రెండు సార్లు జరిగిన ఈ బాంబు పేలుళ్ల ఘటనలో ఇప్పటివరకూ ముగ్గురు కమాండోలు సహా మొత్తం ఆరుగురు మృతిచెందారు. మృతుల సంఖ్యా ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు పటిష్ఠ బందోబస్తు చర్యలు చేపట్టారు. అయితే.. ఇది ఆత్మాహుతి బాంబు దాడేనని పాక్ మీడియా కథనాలు ప్రకటిస్తున్నాయి. ఏది ఏమైనా మానవ బాంబులతో అమాయకుల ఉసురు తియ్యడం ఉన్మాదానికి పరాకాష్ట..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *